భారతదేశం, మే 25 -- కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాల సందర్భంగా భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దాదాపు 15 కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోయాయి. 5 గంటలుగా భక్తులు నరకం చూస్తున్నారు. కొన్ని వాహనాలు అడవి ప్రాంతంలోనే ఉండిపోయాయి. అక్కడ కనీసం సెల్ ఫోన్ సిగ్నల్స్, తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌ నియంత్రణలో వైఫల్యం ఉందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆదివారం తెల్లవారుజాము నుంచి ఇదే పరిస్థితి ఉంది. కొందరు పసి పిల్లలను సంకనెత్తుకుని.. కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ పుష్కరఘాట్‌కు చేరుకుంటున్నారు. కాళేశ్వరం ప్రధాన రహదారి నుంచి అన్నారం క్రాస్‌రోడ్డు తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటుంది. అధికారులు రెండు రోజుల నుంచి వాహనాలను అన్నారం క్రాస్‌లోని స్తూపం నుంచి అన్నారం మీదుగా మద్దులపల్లి, పూస్కుపల్లి నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని కాళేశ్వర మా...