భారతదేశం, మే 15 -- జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో సరస్వతీ పుష్కరాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. వేకువ జామున గురు మదనానంద స్వామిజీ తొలి స్నానాలు చేసి పుష్కరాలను ప్రారంభించారు. అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించే త్రివేని సంగమంలో సరస్వతీ పుష్కరాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి జరుగుతున్న సరస్వతీ పుష్కరాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. తెల్లవారు జామున 5.44కు మొదట పుణ్యస్నానాలతో సరస్వతీ పుష్కరాలను ప్రారంభించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తెలంగాణ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్‌ దంపతులు కాళేశ్వరంలో పూజలు నిర్వహించారు.

గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దంపతులు సరస్వతీ నదిలో పుణ్యస్నానాలు చేస్తారు. బుధవారం రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథునరాశిలోకి ప్రవ...