భారతదేశం, సెప్టెంబర్ 1 -- తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు కాళేశ్వర నివేదికపై హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో హరీశ్ రావు మధ్యంతర పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే ఆదివారం నాడు విచారణకు కోర్టు నిరాకరించింది.

సోమవారం అదే బెంచ్‌లో లంచ్ మోషన్‌లో విచారణ జరపాలని కేసీఆర్, హారీశ్ రావు కోరారు. కోర్టు లంచ్ మోషన్ కూడా స్వీకరించలేదు. రెగ్యులర్ పిటిషన్స్ లాగానే విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. మంగళవారం ఉదయ 10.30 గంటలకు విచారణ చేస్తామని పేర్కొంది. అయితే రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించలేమని,సీబీఐ విచారణ ఆపాలని చెప్పలేమని హైకోర్టు వెల్లడించింది.

కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వ నిర్ణయం తెలుసుకుని చెప్పా...