భారతదేశం, ఆగస్టు 5 -- హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో వాస్తవాలను వక్రీకరించిందని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణంపై జరిగిన అక్రమాలంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ, హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన ఒక పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి రహస్యాలు లేవని, అన్ని వివరాలు డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) లో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

నిన్నటి కేబినెట్ మీటింగ్‌లో ప్రభుత్వం ప్రస్తావించిన నాలుగు అంశాలపై హరీష్ రావు ఘాటుగా స్పందించారు.

తమ్మిడిహట్టి నుంచి మార్పుపై: ప్రాజెక్టును తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం తమ నిర్ణయం కాదని ఆయన అన్నారు. తమ్మిడిహట్టి ...