భారతదేశం, నవంబర్ 26 -- ముంబైలో షాకింగ్​ ఘటన చోటుచేసుకుంది! చెంబూరు ప్రాంతంలోని ఓ ఆలయంలో కాళీ మాత విగ్రహాన్ని మేరీ మాత రూపంలో అలంకరించడం భక్తులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ పరిణామంపై హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

నివేదికల ప్రకారం.. కొందరు భక్తులు దర్శనం కోసం ఆలయానికి వచ్చినప్పుడు, కాళీ మాత విగ్రహం మేరీ మాత రూపాన్ని పోలి ఉండటం చూసి షాక్​ అయ్యారు.

దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహానికి లోనై, వెంటనే ఆలయ నిర్వహణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయం వివాదాస్పదంగా మారడంతో, స్థానికంగా ఉన్న పలు హిందూ సంఘాల నాయకులు కూడా అక్కడికి చేరుకుని నిరసన తెలియజేశారు.

ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు కొద్దిసేపటికే ఆలయానికి చేరుకున్నారు.

పోలీసులు విచారణ జరిపినప్పుడు, ఆలయ పూజారి ఒక వింత వాదన వినిపించారు.

"కాళీ మాత నా కలలోకి వచ్చింది. తనను మ...