భారతదేశం, ఏప్రిల్ 16 -- కాల్ సెంటర్ ముసుగులో అశ్లీల వీడియోలు రూపొందిస్తూ...వాటిని నిషేధిత అశ్లీల వెబ్ సైట్ లకు విక్రయిస్తున్న ముఠాను ఏపీ ఈగల్ టీమ్ పట్టుకుంటుంది. ఈ ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు 'ఈగల్' చీఫ్ రవికృష్ణ తెలిపారు. ముగ్గురు నిందితులను గుంటూరులో ఈగల్ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు.

లూయిస్ అనే వ్యక్తి గుంతకల్లులో కాల్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఇతడు కాల్ సెంటర్ ముసుగులోనే అశ్లీల వీడియోలు రూపొందిస్తున్నాడు. ఈ వీడియోలను నిషేధిత అశ్లీల వెబ్ సైట్లకు విక్రయిస్తున్నాడు. వీడియోలను అమ్మి.. క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లింపులు పొందుతున్నాడు. లూయిస్ కు శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన గణేష్, జోత్న్సలు సహకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

లూయిస్‌ కాల్‌ సెంటర్‌ నడుపుతూ అక్కడ పనిచేస్తున్న వారితో బలవంతంగా అశ్లీల వీడియోలు ...