భారతదేశం, మే 10 -- భారత్-పాక్ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరుదేశాలు పూర్తి మరియు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ప్రకటించారు. ఈ విషయాన్ని భారత్, పాకిస్తాన్ లు ధ్రువీకరించాయి. డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ హ్యాండిల్ లో ఈ వార్తను ప్రకటించారు. రెండు దేశాలు ఒప్పందానికి చేరుకున్నందుకు ఇరు దేశాలను అభినందించారు.

పోరాటం లేదా యుద్ధాన్ని తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నిలిపివేయడాన్ని కాల్పుల విరమణగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఇరుదేశాలు సంధి ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా చర్చలను ప్రారంభిస్తాయి. భారత్-పాక్ లు తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించినందున, మే 10, సాయంత్రం 5 గంటల నుంచి ఇరుదేశాలు క్షిపణి, డ్రోన్ దాడులను నిలిపివేస్తాయి. పౌర మౌలిక సదుపాయాలను కూడా ఇరు పక్షాలు లక్ష్యంగా చేసుకోవు.

ప్రత్యర్థి పక్షా...