Telangana, జూన్ 27 -- ఒకనాటి ఉద్యమాల గడ్డ తెలంగాణ మాదక ద్రవ్యాల మహమ్మారికి అడ్డాగా మారకూడదన్న లక్ష్యంతో 'ఈగల్'(Eagle)ను ఏర్పాటు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రపంచంతో పోటీ పడే ఒక ఆరోగ్యకరమైన, మాదక ద్రవ్య రహిత తెలంగాణను నిర్మించుకోవడంలో ప్రభుత్వ సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం పురస్కరించుకుని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణపై కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....