Hyderabad, జనవరి 31 -- కూరగాయలు మన ఆహారంలో చాలా ముఖ్యమైన భాగం. ఇవి రుచికరమైనవి, చాలా పోషకాలతో సమృద్ధిగా ఉండేవి. మన రోజువారీ ఆహార అవసరాలలో ఎక్కువ భాగం కూరగాయలతోనే తీరుతుంది. అయితే, కొన్నిసార్లు ఈ కూరగాయలు మీ ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా కూడా మారవచ్చు. క్యాబేజీ, కాలిఫ్లవర్ వంటివాటిలో పురుగులు అధికంగా చేరుతాయి. ఇవి మెదడుకు చాలా హానికరమని మీరు వినే ఉంటారు. వాస్తవానికి, ఇవి చిన్న పురుగులే కావచ్చు. కానీ అవి శరీరంలో చేరితే మన రక్తానికి, మెదడుకు చేరుతాయి. ఇవి క్యాబేజీలోనే కాకుండా అనేక ఇతర కూరగాయల్లో కూడా ఉంటాయి. ఈ కూరగాయలను తినాలనుకుంటే వాటిని బాగా కడిగి శుభ్రపరిచి తినండి. కాబట్టి ఈ ప్రమాదకరమైన కీటకాలు ఏ కూరగాయల్లో ఉంటాయో తెలుసుకోండి.

వంకాయను తినేవారి సంఖ్య ఎక్కువే. ఇది ఏడాది పొడవునా లభిస్తుంది. దీనితో చేసే కూరలు ఎంతో మందికి ఇష్టం. వంకాయను వండే ము...