Hyderabad, జనవరి 28 -- చాలామంది వంటగదిలో చేయి కాలినప్పుడు లేదా ఏదైనా వేడి వస్తువు తగిలినప్పుడు వెంటనే బాత్రూంలో ఉన్న టూత్‌పేస్ట్‌ను గాయం మీద రాసుకుంటారు. మీరు లేదా మీ చుట్టూ ఉన్నవారు కూడా అలాగే చేస్తుండవచ్చు. కానీ అలా చేయడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని మీకు తెలుసా? మీరనే కాదు వందలో దాదాపు 70 శాతం మంది కాలిన చర్మానికి టూత్‌పేస్ట్ రాసుకునే తప్పు చేస్తారట. టూత్‌పేస్ట్ చల్లదనాన్ని కలిగించి మంట, నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుందని చాలామంది అనుకుంటారు, కానీ అది ఒక భ్రమ మాత్రమే. కాలిన చర్మానికి టూత్‌పేస్ట్ ఎందుకు రాసుకోకూడదో హెల్త్ కోచ్ ప్రీతి షా ఒక అధ్యయనాన్ని ఉదహరిస్తూ వివరించారు. వేడి వస్తువు తగిలినప్పుడు, చర్మం కాలినప్పుడు టూత్‌పేస్ట్ ఎందుకు రాసుకోకూడదో తెలుసుకుందాం.

టూత్‌పేస్ట్‌లో ఉండే కొన్ని రసాయనాలు చర్మానికి హాని కలిగిస్తాయి. దీనివల...