Hyderabad, ఏప్రిల్ 14 -- చేతులతోనే మనం అన్ని పనులు చేస్తాము. అందుకే చేతివేళ్ళకున్న గోళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆ గోళ్ళనే ప్రతివారం కత్తిరిస్తూ ఉంటారు. చేతి గోళ్ళని పరిశుభ్రంగా ఉంచుకుంటారు కానీ కాలిగోళ్ళ విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తారు. నిజానికి కాలిగోళ్ళను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే వాటిని ప్రతి వారం కత్తిరించాలి. లేకుంటే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. అవి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కూడా కారణం అవుతాయి.

కాలిగోళ్ళు పెరగడం వల్ల అసౌకర్యంగా అనిపిస్తుంది. బూట్లు వేసుకునేటప్పుడు ఆ గోల్డ్ పాదాలపై ఒత్తిడి తీసుకొస్తాయి. దీనివల్ల నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కోసారి ఇది బాధాకరమైన పరిస్థితిగా మారుతుంది. గోళ్ల అంచులు చర్మంలోకి చేర్చుకొని పోతూ ఉంటాయి. ముఖ్యంగా బొటన వేలికే ఈ సమస్య అధికంగా ఉంటుంది. ఎక్కువ కాలం పాటు ఇల...