భారతదేశం, ఫిబ్రవరి 18 -- తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(CURE)ను కాలుష్యరహిత గ్రీన్, నెట్ జీరో సేవల కేంద్రంగా అభివృద్ధి చేసి, సుస్థిర పట్టణాభివృద్ధిలో హైదరాబాద్ నగరాన్ని దేశానికే ఒక నమూనాగా నిలబెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కార్బన్ ఫుట్‌ప్రింట్ ఆడిట్ చేపట్టనున్న తొలి భారత నగరంగా హైదరాబాద్ నిలవబోతుందని, రాబోయే ఐదేళ్లలో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(క్యూర్)లో కాలుష్య కారక పరిశ్రమలు ఉండవని స్పష్టం చేశారు.

ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన 'ముంబై క్లైమెట్ వీక్' సదస్సులో నీతి ఆయోగ్ (NITI Aayog) వైస్ ఛైర్మన్‌ సుమన్ బేరీ, ఇతర అతిథులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. నగరాభివృద్ధి, వాతావరణ మార్పులకు అనుగుణమైన విధానాలపై ముఖ్యమంత్రి తెలంగాణ దృక్పథాన్ని వివరించారు.

గ్రీన్ ఎనర్జీ ప్రపంచ పరిరక్షణకు లాభద...