భారతదేశం, మే 19 -- ప్రస్తుతం కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకోవాలంటే.. ఒకటో తరగతి నుంచే రూ. లక్షల ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి. దీంతో పేద పిల్లలకు అక్కడ చదువుకునే అవకాశం లేకుండా పోయింది. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. నిర్బంద విద్యాహక్కు చట్టం కింద పేదల పిల్లలకు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కనీసం 25 శాతం సీట్లను కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ చట్టం ప్రకారం ఒకటో తరగతిలో పేద పిల్లలకు ప్రవేశాలు కల్పించనున్నారు. అక్కడి నుంచి 8వ తరగతి వరకు ఉచితంగా బోధించనున్నారు. విద్యాహక్కు చట్టం కింద ప్రవేశాలు పొందిన పిల్లలకు.. ప్రభుత్వమే ఫీజు చెల్లించనుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకునేందుకు అనేక మంది విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ను...