Hyderabad, మే 4 -- డైరెక్టర్ శైలేష్ కొలను లేటెస్ట్‌గా తెరకెక్కించిన సినిమా హిట్ 3. నేచురల్ స్టార్ నాని హీరోగా చేసిన హిట్ ది థర్డ్ కేస్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. అయితే, ఇప్పటికీ హిట్ ఫ్రాంచైజీలో మూడు సినిమాలు రాగా హిట్ 4 మూవీపై మరింత బజ్ క్రియేట్ అవుతోంది. హిట్ 1లో విశ్వక్ సేన్, హిట్ 2లో అడవి శేష్, హిట్ 3లో నాని నటించిన విషయం తెలిసిందే.

అయితే, హిట్ 4లో తమిళ స్టార్ హీరో కార్తీ మెయిన్ లీడ్ రోల్ చేయనున్నట్లు హిట్ 3 మూవీలోనే హింట్ ఇచ్చారు. హిట్ 4లో కార్తీ ఏసీపీ వీరప్పన్‌గా కనిపించనున్నాడు. అయితే, తాజాగా హిట్ 4లో కార్తీ పాత్రపై, హిట్ 6, హిట్ 7 సినిమాల అప్డేట్స్‌ను డైరెక్టర్ శైలేష్ కొలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

-కార్తీ క్యారెక్టర్ ఏంటి అనేది నాకు ఐడియా ఉంది. ఆల్‌రెడీ సినిమాలో చూపించాం. తనకి (కార్తీకి) క్రికెట్ అంటే ఇష్టం. క్రికెట్ బెట్టి...