భారతదేశం, అక్టోబర్ 27 -- కార్తీక మాసానికి ఉన్న ప్రత్యేకత ఇంత అంతా కాదు. కార్తీక మాసం చాలా విశేషమైనది. నెల రోజులు పాటు శివుని ప్రత్యేకించి ఆరాధిస్తారు. శివాలయాల్లో అభిషేకాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు జరుపుతారు. నదీ స్నానానికి కూడా ఎంతో విశిష్టత ఉంటుంది. అలాగే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి కూడా చాలా విశేషమైనది. కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులు వెలిగిస్తారు. ఈ సంవత్సరం కార్తీక మాసం ఎప్పుడు వచ్చిందో, కార్తీక మాసంలో ఏం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో, కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలో వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పంచాంగం ప్రకారం చూసినట్లయితే కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ 4 రాత్రి 10:30కి మొదలై నవంబర్ 5 సాయంత్రం 6:48 వరకు ఉంటుంది. నవంబర్ 5న పౌర్ణమి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంది కాబట్టి పౌర్ణమిని ఆ రోజే జరుపుకోవాలి. చాలా మంది నదీ స్నానం చేసి, దీప...