Hyderabad, జూలై 10 -- తెలుగు టీవీ సీరియల్స్ కు సంబంధించి 26వ వారం టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. వీటిలో స్టార్ మా సీరియల్స్ మరోసారి దుమ్మురేపాయి. చాలా రోజులుగా టాప్ లో ఉంటూ వస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ ఈవారం మరింత మెరుగైన రేటింగ్ తో గత రికార్డులను బ్రేక్ చేసింది.

ఈ ఏడాది 26వ వారానికి సంబంధించి తెలుగు టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. వీటిలో స్టార్ మాలో వచ్చే కార్తీక దీపం 2 సీరియల్ ఈసారి ఏకంగా 14.40 రేటింగ్ సాధించడం విశేషం. ఇదో రికార్డుగా చెప్పొచ్చు. కేవలం అర్బన్ రేటింగ్ కూడా దీనికి 11.44గా నమోదైంది. చాలా కాలంగా 12, 13 రేటింగ్స్ తో ఉంటూ వస్తున్న కార్తీకదీపం 2 సీరియల్ కు ఈ మధ్య కాలంలో ఫాలోయింగ్ ఎంత పెరిగిందో తాజా రేటింగ్ చూస్తూ తెలుస్తోంది.

ఇక రెండో స్థానంలో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా 13.03 రేటింగ్ సాధించింది....