భారతదేశం, మే 27 -- కార్తీక దీపం 2 ఈరోజు (మే 27, 2025) ఎపిసోడ్‍లో.. సుమిత్ర అత్త, దశరథ్ మామయ్యల అసలు కూతురివి, నా అసలైన మరదలవి నువ్వే అని దీపకు నిజం చెబుతాడు కార్తీక్. దీంతో దీప ఆశ్చర్యపోతుంది. శివన్నారాయణకు సొంత మనవరాలివి.. యావదాస్తికి ఒక్కగానొక్క వారసురాలివి అని కార్తీక్ అంటాడు. ఏం మాట్లాడుతున్నారు కార్తీక్ బాబు.. నేను వాళ్ల కూతురిని ఏంటి అని దీప అడుగుతుంది. "దీప.. నీ పుట్టుక గురించి నీకు తెలియదు. నువ్వు కుబేర, అంబుజవల్లిల కన్న కూతురివి కాదు. పెంపుడు కూతురివి" అని కార్తీక్ చెబుతాడు. దీప షాక్ అవుతుంది. కుబేరకు నువ్వు బస్టాండ్‍లో దొరికికావ్ అని కార్తీక్ చెబుతాడు.

కుబేర్ నా కన్నతండ్రి కాదని మీకు ఎవరు చెప్పారని కార్తీక్‍న దీప ప్రశ్నిస్తుంది. దాసు మామయ్య అని కార్తీక్ బదులిస్తాడు. దాసుకే గతం గుర్తు లేదు.. మీకు నా గురించి చెప్పారా అని దీప అంటు...