భారతదేశం, మే 26 -- కార్తీక దీపం 2 నేటి (మే 26, 2025) ఎపిసోడ్‍లో.. కార్తీక్ ఇంకా రాలేదంటూ కాంచన ఎదురుచూస్తూ ఉంటుంది. భోజనం చేయండని దీప అడుగుతుంది. నీకు ఆకలేస్తోందా అని కాంచన అంటుంది. భార్యవి నువ్వు అలా ఉంటే, తల్లిని నేనెంత తల్లడిల్లిపోవాలి అంటూ బాధపడతుంది. ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంది. కార్తీక్ కాల్ చేశాడేమోనని కాంచన అంటుంది. మీ మేన కోడలు కాల్ చేస్తోందని దీప అంటే.. అవసరం లేదు ఎత్తవద్దు అని కాంచన అంటుంది. ఏవో వీడియోలు పంపించిందని దీప చెబుతుంది.

తాత ఇంట్లో బూట్లను కార్తీక్ తుడిచిన, భోజనం వడ్డించిన వీడియోలను జ్యోత్స్న పంపించి ఉంటుంది. ఆ వీడియోలను చూసి దీప, కాంచన తల్లిడిల్లిపోతారు. కన్నీరు పెట్టుకుంటారు. ఇంతలో కార్తీక్ వచ్చేస్తాడు. ఎందుకు అందరూ అలా ఉన్నారని అడుగుతాడు. ఫ్రెండ్ వాళ్ల బాబు పుట్టిన రోజు అని కాల్ చేస్తే అటు వెళ్లాలని కార్తీక్ చెబుతాడ...