భారతదేశం, మే 20 -- కార్తీక దీపం 2 నేటి (మే 20, 2025) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును జ్యోత్స్నకు ఇచ్చేయాల్సి రావడంతో ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. తాను అవార్డు తీసుకోవడం లేదని ఇంట్లో ఎలా చెప్పాలా అని దిగాలుగా కూర్చొని ఉంటాయి. 'సత్యరాజ్ రెస్టారెంట్‍కు అవార్డు వస్తే.. నాకు వచ్చినట్టేనని, అంటే స్టేజ్‍పై అవార్డు అందుకునేది నేనే' అని జ్యోత్స్న అన్న మాటలను గుర్తు చేసుకుంటాడు. ఎలాగైనా అవార్డు ఫంక్షన్‍కు వీళ్లను రాకుండా ఆపాలి అని కార్తీక్ అనుకుంటాడు. నేను అవార్డు ఫంక్షన్‍కు ఈ గౌనే వేసుకుంటానని, ఎలా ఉంది అంటూ కార్తీక్ దగ్గరికి శౌర్య వస్తుంది.

వేరే గౌన్ వేసుకోవాలని శౌర్యతో దీప చెబుతుంది. రేపు నువ్వు ఫంక్షన్‍కు రావడం లేదు కదా.. ఈ డ్రెస్‍తో పని ఏముంది అని శౌర్యతో కార్తీక్ అంటాడు. నన్ను వదిలేసి వెళతారా అని శౌర్య అడుగుతుంది. ...