భారతదేశం, మే 19 -- కార్తీక దీపం 2 నేటి (మే 19, 2025) ఏం జరిగిందంటే.. కార్తీక్ నడుపుతున్న రెస్టారెంట్‍కు అవార్డు వచ్చిన సంబరంలో కుటుంబ సభ్యులు ఉంటారు. రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చినందుకు సెలెబ్రేట్ చేసుకుంటుంటారు. దీపకు స్వీట్ తినిపిస్తాడు కార్తీక్. ఇంతలో కార్తీక్‍కు మెసేజ్ వస్తుంది. 'బావ నిన్ను అర్జెంట్‍గా కలవాలి.. త్వరగా రా' అని జ్యోత్స్న మెసేజ్ చేసి ఉంటుంది. ఎవరు మెసేజ్ చేశారని దీప అడుగుతుంది. తెలిసిన వాళ్లు.. మీరు మాట్లాడుతూ ఉండండి నేను వచ్చేస్తానని కార్తీక్ అక్కడి నుంచి వెళతాడు.

జ్యోత్స్న దగ్గరికి కార్తీక్ వెళతాడు. ఎందుకు రమ్మని మెసేజ్ చేశావని అడుగుతాడు. కంగ్రాట్స్ బావ అని చేయి ఇస్తుంది జ్యోత్స్న. అప్పుడే విషయం నీ వరకు వచ్చిందా అని కార్తీక్ అడుగుతాడు. నువ్వంటే నాకు ఎంత ప్రేమో నీకు తెలియదు బావా అని జ్యోత్స్న అంటుంది. ఇప్పుడు న...