భారతదేశం, మే 17 -- కార్తీక దీపం 2 నేటి (మే 17, 2025) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. తనపై హత్యయత్నం కేసులో జ్యోత్స్న పేరు ఎందుకు చెప్పారని కార్తీక్‍ను దీప అడుగుతుంది. కత్తిపై వేలు ముద్రలు ఉన్నాయని అనుమానంతో పోలీసులను శివన్నారాయణ ఇంటికి పంపిస్తే జ్యోత్స్న వాళ్లకు వేరేలా అర్థమవుతుందని అంటుంది. రెండు కుటుంబాల మధ్య శత్రుత్వం మరింత పెరుగుతుందని బాధపడుతుంది. ఇప్పుడు మాత్రం భుజాలపై చేయి వేసుకొని కలిసి కూర్చొని భోజనం చేస్తున్నారని అనుకుంటున్నావా, ఇప్పుడూ వాళ్ల మనల్ని శత్రువులుగానే చూస్తున్నారని అని కార్తీక్ అంటాడు.

ఈ గొడవలు, ఆ ఇంటి మనుషుల ప్రవర్తన చూస్తుంటే ఒకప్పుడు రెండు కుటుంబాలు విడిపోవడమే మంచిది అనిపించేదని కార్తీక్ అంటాడు. మరిప్పుడు అని దీప ప్రశ్నిస్తుంది. రెండు కుటుంబాలను కలపాలి దీప అని కార్తీక్ చెబుతాడు. మనసు ఎందుకు మార్చుకున్నారని దీప ప్రశ్ని...