భారతదేశం, మే 14 -- కార్తీక దీపం 2 నేటి (మే 14, 2025) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. చెత్త ఏరుకునే మనిషిలా మారువేషంలో వచ్చిన పారిజాతం.. వస్తువు కింద పడడంతో అనసూయ వస్తుందేమోనని పారిపోతుంటుంది. ఇంతలో అనసూయ అక్కడికి వస్తుంది. ఏవమ్మా.. ఆగు అంటూ అరుస్తుంది. దీని కంట్లో పడ్డానేంటి.. నన్ను కనిపెట్టేస్తుందా ఏంటి అని పారిజాతం భయపడుతుంది. చెత్త ఏరుకునే దానివి లోపల నీకేంటి పని అని అనసూయ ప్రశ్నిస్తుంది. తలెత్తి మాట్లాడు అని గట్టిగా అంటుంది. గుర్తు పట్టకుండా ఎక్స్ ప్రెషన్స్ మారుతుంది పారిజాతం. లోపలికి ఎందుకు వచ్చావ్ అని అనసూయ అడుగుతుంది. నన్ను గుర్తుపట్టలేదు అని పారిజాతం అనుకుంటుంది.

తినడానికి ఏదైనా ఉందేమోనని లోపలికి వచ్చానని మారువేషంలో ఉన్న పారిజాతం అంటుంది. అడిగితే పెట్టేదాన్ని కదా అని అనసూయ అంటుంది. ఈ మధ్య దొంగలు కూడా మారువేషాల్లో తిరుగుతున్నారని చెబుత...