భారతదేశం, మే 13 -- కార్తీక దీపం 2 నేటి (మే 13, 2025) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. జ్యోత్స్నను చేయి పట్టుకొని గదిలోకి లాక్కొస్తుంది పారిజాతం. "దీపను ఎవరితో పొడిపించావో చెప్పు" అని పారు అడుగుతుంది. దీంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఎవరు ఆ ముసుగు మనిషి అని పారు అడుగుతుంది. మీ తాత లైసెన్స్డ్ గన్‍లో బుల్లెట్ ఏం చేశావంటూ మరో ప్రశ్న వేస్తుంది. నీకేమైంది, నీకేమైంది గ్రానీ అని జ్యో అంటుంది. ఊరికే నన్ను అనుమానించొద్దని చెబుతుంది. తానేమీ చేయలేదని చెబుతుంది.

నా అనుమానం నిజం కాదంటావా అని పారిజాతం అడుగుతుంది. మరి కార్తీక్ ఇంటికి వచ్చాడని ప్రశ్నిస్తుంది. ఎందుకొచ్చాడో చెప్పాడు కదా అని జ్యో అంటుంది. "ఇంతకు ముందు కార్తీక్‍‍లా వాడు రాలేదు. ఏదో పద్ధతిగా, ఏదో కొత్త విషయం తెలిసిన వాడిలా మాట్లాడుతున్నాడు. అది నాకెలా తెలుస్తుందని జ్యోత్స్న అంటుంది. మరి వాడు మాట్లాడు...