భారతదేశం, మే 12 -- కార్తీక దీపం 2 నేటి (మే 12, 2025) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. మిమ్మల్ని ఎవరు పొడిచారో చూశారా అని ఆసుపత్రిలో బెడ్‍పై ఉన్న దీపను ఎస్ఐ ప్రశ్నిస్తాడు. పొడిచిన వ్యక్తి ఆడా, మగా అని ప్రశ్నిస్తాడు. మగవాడే అని దీప బదులిస్తుంది. ముసుగు వేసుకున్నందుకు గుర్తు పట్టలేకపోయానని అంటుంది. ఎవరి మీద అయినా అనుమానం ఉందా అని ఎస్ఐ అంటే లేదంటుంది. ఈ మధ్య ఎవరితోనైనా గొడవ పడ్డారా అని ఎస్ఐ అడుగుతాడు. లేదని దీప సమాధానం చెబుతాడు. జ్యోత్స్న కుటుంబం వారు ఎవరూ సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారని, ఆ మూడో వ్యక్తి ఎవరో తెలిస్తేనే ఈ హత్యాయత్నం ఎవరు చేశారని తెలుస్తుందని ఎస్ఐ చెబుతాడు. ఆ ఏరియాలోనే సీసీ టీవీ ఫుటేజ్ చూస్తామని చెప్పి ఎస్ఐ వెళ్లిపోతాడు. జ్యోత్స్న వాళ్ల ఇంటికి ఎస్ఐ ఎందుకు వెళ్లాడని కార్తీక్‍ను దీప అడుగుతుంది.

కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరి మీద అయి...