భారతదేశం, మే 10 -- కార్తీక దీపం 2 సీరియల్ నేటి (మే 10, 2025) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దీపే అసలైన వారసురాలు అని చెప్పేస్తానని, నేను బతికి ఉంటే ప్రమాదమని జ్యోత్స్న నన్ను చంపాలనుకుందని కార్తీక్‍తో దాసు అంటాడు. తనను తలపై కొట్టిందని చెబుతాడు. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. నేను తన కన్న తండ్రినని తెలిసి చంపాలనుకుందుంటే అసలైన వారసురాలిని వదిలిపెడుతుందా అని దాసు చెబుతాడు. దీంతో కార్తీక్ కంగారు పడతాడు. దీపే అసలైన వారసురాలు అని జ్యోత్స్న నిశ్చితార్థం రోజు చెప్పాలనుకున్నా ఎవరు చెప్పనివ్వలేదని దాసు అంటాడు. ఆతర్వాత ఏమైందో గుర్తు లేదని చెబుతాడు.

"నువ్వు చెప్పేది నమ్మలేకపోతున్నా.. దీప పెద్ద మామయ్య కూతురు ఏంటి.. జ్యోత్స్న నీ కూతురు ఏంటి?" అని కార్తీక్ ఆశ్చర్యంగా అంటాడు. ఇవన్నీ పారిజాతం అమ్మమ్మకు తెలుసు కదా అని అడుగుతాడు. లేదు.. దీపే అసలైన వారసురాలు అనే ...