భారతదేశం, జూన్ 9 -- కార్తీక దీపం 2 నేటి (జూన్ 9, 2025) ఎపిసోడ్‍లో.. దశరథ్‍ను నాన్న అని పిలిచినందుకు దీపపై జ్యోత్స్న ఆగ్రహిస్తుంది. కొట్టేందుకు చేయి ఎత్తిన జ్యోను అడ్డుకుంటాడు కార్తీక్. దశరథ్‍ను కిందపడకుండా కాపాడి, మంచి చేసిన దీపను తిడతారా అంటూ కార్తీక్ ఫైర్ అవుతాడు. నా భార్యను మామయ్య కూతురా అని అంటే.. నా భార్య తల్లి వచ్చి దీప నీకు పుట్టిందా అని అడిగితే నీకు ఎలా ఉంటుందని సుమిత్రను కార్తీక్ ప్రశ్నిస్తాడు. లాగిపెట్టి కొట్టాలనిపిస్తుందని సుమిత్ర అంటే.. అయితే నీ కూతురిని కొట్టు, దవడపళ్లు రాలిపోవాలని అని కార్తీక్ అంటాడు. బావా అని జ్యో అరిస్తే.. బావ కాదు డ్రైవర్ అని బదులిస్తాడు కార్తీక్.

నాన్న అని పిలిచినందుకు దీప పుట్టుకను నేనేం అవమానించలేదే అని జ్యోత్స్న అంటుంది. జన్మనిస్తేనే నాన్న అని పిలవాలని అన్నావ్ కదా అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. ఎవరుపడిత...