భారతదేశం, జూన్ 11 -- కార్తీక దీపం 2 సీరియల్ నేటి (జూన్ 11, 2025) ఎపిసోడ్‍లో.. శౌర్యకు తన చిన్నప్పటి బొమ్మలు, డ్రెస్‍ను ఇవ్వడంతో జ్యోత్స్న గొడవ చేస్తుంది. దశరథ్, సుమిత్ర బాధపడతారు. తన చిన్ననాటి బొమ్మలు, డ్రెస్‍లు చెత్తకుప్పలో పాడేస్తానని జ్యో పొగరుగా అంటుంది. అయితే, అవి తాము తీసుకెళతామని కార్తీక్ చెబుతాడు.భోజనానికి మా ఇంటికి వెళతామని కార్తీక్ అంటాడు. వెళ్లొస్తానని అన్నావదినలకు కాంచన చెబుతుంది. ఉండొచ్చు కదా అని దశరథ్ అంటే.. "నేను ఈ ఇంట్లో చోటు కోరుకోవడం లేదు అన్నయ్యా. నీ మనసులో చోటు ఉంది కదా చాలు" అని కాంచన అంటుంది. సుమిత్ర బాధగా కనిపించినా ఏమీ మాట్లాడదు. వెళ్లు అంటూ శౌర్యను నెడుతుంది పారిజాతం.

కోపంగా తన గదిలోకి వెళుతుంది జ్యోత్స్న. తప్పు చేశావే అని పారిజాతం వారిస్తుంది. నా బొమ్మలు దీప కూతురికి ఇవ్వడం ఏంటి అని జ్యో అంటుంది. "ఇన్ని రోజులు ద...