భారతదేశం, జూన్ 4 -- ద‌శ‌ర‌థ్‌, సుమిత్ర‌ల‌కు జీడిప‌ప్పు, ముల‌క్కాడ క‌ర్రీ అంటే బాగా ఇష్ట‌మ‌ని స్పెష‌ల్‌గా ప్రిపేర్ చేస్తుంది దీప‌. వంట చేయ‌డంలో దీప‌కు సాయం చేస్తాడు కార్తీక్‌. కూర‌గాయ‌లు క‌ట్ చేస్తాడు. వ‌ద్ద‌ని దీప అంటుంది. నా పెళ్లానికి నేను సాయం చేస్తే త‌ప్పేంటి బ‌దులిస్తాడు.

నేనేమో నిన్ను వార‌సురాలిని చేద్దామ‌ని అనుకున్నా...సుమిత్ర అత్త అస‌లు కూతురు కిచెన్‌లో క‌ష్ట‌ప‌డుతుంటే, దొంగ కూతురు ఏసీ రూమ్‌లో సుఖ‌ప‌డుతుంద‌ని కార్తీక్ అంటాడు.

నేను క‌ష్ట‌ప‌డేది మా అమ్మ నాన్న‌ల గురించే క‌దా అని దీప అంటుంది. అస‌లు వార‌సురాలు అని నిజం తెలిసిన ఇలాగే ఉంటాన‌ని, నా వాళ్ల‌తో నేను ఉండ‌టంలో కాదు...వాళ్ల‌కు కావాల్సిన‌వి ఇవ్వ‌డంలో నా సంతోషం ఉంటుంద‌ని దీప అంటుంది.

ఆస్తులు, ఐశ్వ‌ర్యాల్లో ఆనందం ఉండ‌ద‌ని దీప లాజిక్‌లు మాట్లాడుతుంది. సుమిత్ర‌మ్మ గారి అమ్మాయి క‌బ...