భారతదేశం, జూన్ 13 -- త‌న బ‌ర్త్‌డే కేక్‌ను కింద‌ప‌డేసి సుమిత్ర‌, శివ‌న్నారాయ‌ణ చేత దీప‌ను తిట్టించాల‌ని ప్లాన్ చేస్తారు జ్యోత్స్న‌, పారిజాతం. కేక్‌ను పారిజాతం కింద‌ప‌డేస్తుంది. దీప‌నే ఆ ప‌ని చేసింద‌ని జ్యోత్స్న‌, పారిజాతం నింద‌లు వేస్తారు. దీప త‌న ఆనందాల్ని దూరం చేస్తుంద‌ని, బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేసుకోన‌ని క‌న్నీళ్లు పెట్టుకున్న‌ట్లుగా న‌టిస్తూ రూమ్‌లోకి వెళ్లిపోతుంది.

పారిజాతం కేక్ కింద‌ప‌డేస్తుండ‌గా త‌న మొబైల్‌లో వీడియో తీస్తాడు కార్తీక్‌. ఆ వీడియోను అడ్డుపెట్టుకొని జ్యోత్స్న‌ను ఆట ఆడుకుంటాడు. బ‌ర్త్‌డే చేసుకోన‌ని రూమ్‌లోకి వెళ్లిపోయిన జ్యోత్స్న‌ను హాల్‌లోకి తీసుకొస్తాడు. కార్తీక్ స్వ‌యంగా కేక్ ఆర్డ‌ర్ చేస్తాడు. ఆ కేక్‌పై జ్యోత్స్న‌తో పాటు దీప పేరు కూడా ఉంటుంది. ఆ కేక్ చూసి జ్యోత్స్న షాక‌వుతుంది. జ్యోత్స్న‌నే కేక్‌పై దీప పేరు ఉండాల‌న...