Hyderabad, ఆగస్టు 16 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో సుమిత్ర అన్న మాటలకు దీప ఏడుస్తు ఉంటుంది. పారిజాతం, జ్యోత్స్న వచ్చి మాటలు అంటారు. నీ గురించి మా అమ్మ సరిగ్గానే అర్థం చేసుకుంది. నువ్వెప్పుడు మా అమ్మ ప్రేమ కోసం ఆరాటపడుతూనే ఉంటావుగా అని జ్యో అంటుంది.

దీప నువ్వే తాళి తెంచుకుని జ్యోత్స్న చేతిలో పెట్టావుగా. నువ్ అలాంటిదానివేనే. నువ్వేమంటావ్ జ్యోత్స్న అని వెనక్కి తిరుగుతుంది పారిజాతం. అక్కడ జ్యోకి బదులు కార్తీక్ ఉండటంతో ఒక్కసారిగా భయపడి షాక్ అవుతుంది. వీడెప్పుడు వచ్చాడు. మళ్లీ రికార్డ్ చేసి ముసలోడికి వినిపిస్తాడు అని అక్కడి నుంచి జారుకుంటుంది. దీపను కార్తీక్ కిందకు తీసుకొస్తాడు.

బావ లేటెందుకు వచ్చావ్. ఏదో పని మీద వెళ్లావని దీప చెప్పింది. వెళ్లిన పని అయింది. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది నువ్ ఓడిపోతావని అని జ్యోత్స్న అంటుంది. దీప ...