భారతదేశం, జనవరి 7 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 7 ఎపిసోడ్ సుమిత్రను ఇలా చూడటాన్ని తట్టుకోలేకపోతున్నా. తను ఏ తప్పు చేసిందని? తనను అర్థం చేసుకోకుండా ఆ రోజు మాటలతో హింసించి ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణమయ్యా. తను వెళ్తే కానీ విలువ తెలియలేదు. ఇప్పుడు తనకే ముప్పు వచ్చింది. ఎలా తట్టుకోవడం? అని దశరథ బాధపడతాడు.

ఈ వ్యాధి గురించి ఎలారా తనకు చెప్పేది అని దశరథ ఏడుస్తుండగా సుమిత్ర కళ్లు తెరుస్తుంది. ఎందుకు అందరు కన్నీళ్లు పెట్టుకున్నారు? ఏం జరుగుతోంది? దీప నువ్వైనా చెప్పు. కార్తీక్ ను చూస్తావేంటీ? ఏవండీ మీకు ఏమైంది? ఎవరికి ఏమైంది? ఏదో నన్ను చావుకు దగ్గరగా ఉన్న మనిషిలా చూస్తున్నారని సుమిత్ర ప్రశ్నలు వేస్తుంది. నీరసంగా ఉండటంతో కళ్లు తిరిగి పడిపోయావు. డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పిందని కార్తీక్ చెప్తాడు.

నా దగ్గర ఏదో దాస్తున్నారు. ఎందుకో మీ...