భారతదేశం, జూన్ 18 -- సుమిత్రను దీప అమ్మ అనడంతో కాంచన, అనసూయ షాక్ అవడంతో నేటి ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. సుమిత్రను అమ్మ అంటున్నావ్ ఏంటీ? అని అనసూయ అడుగుతుంది. దీంతో కార్తీక్ మధ్యలో వచ్చి ఓనర్లను అమ్మ అని కాదు అమ్మగారు అని పిలవాలి అని కవర్ చేస్తాడు. అలా పిలిస్తే తప్పేం ఉంది, కానీ అందుకు టైమ్ ఉంది అని కార్తీక్ అంటాడు. అనసూయను పెద్దమ్మ అని పిలిచిన కార్తీక్.. దేవుడే ఇంకో అమ్మను దీపకు ఇచ్చాడని అనుకుందామని చెప్తాడు. సుమిత్రమ్మతో అన్నం ఎలా తినిపించాలోనని దీప బాధపడుతుంది.

ఆవిడే వండుకోవచ్చు కదా అని అనసూయ అంటే.. సుమిత్ర కాలు బెణికిందని, సరిగ్గా నడవలేకపోతుందని దీప చెప్తుంది. నడవలేని మనిషి ఎలా వంట చేసుకోగలుగుతుంది, వంట గది వైపు వస్తే నా ముఖం చూడాలి కదా అని దీప అంటుంది. అత్తయ్య ఇలా మారిపోయింది అంటే నువ్వు చెప్తే వింటుందా? అని కాంచనను ప్రశ్నిస్తాడు కార్త...