భారతదేశం, ఆగస్టు 13 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఆగస్టు 13వ తేదీ ఎపిసోడ్ లో అమ్మ సైలెంట్ గా ఉండటం చూసి ఏమైందని ప్రశ్నిస్తాడు కార్తీక్. పెళ్లికి నాన్న ఒప్పుకోవడంతోనే అయిపోదు కదా. మిగతా విషయాలు మాట్లాడాలంటే ఎలాగో ఏంటో? వాళ్లు మన ఇంటికి రావాల్సిన అవసరం లేదు. మనం వెళ్లలేం అని కాంచన అంటుంది. అప్పుడే దశరథ్ ఎంట్రీ ఇస్తాడు. నీ పుట్టింటికి నువ్వు బంధువే కానీ చుట్టానివి కాదమ్మా. ఏదైనాా నేను ఇవ్వనని అననమ్మా అని దశరథ్ అంటాడు. శివన్నారాయణ, పారిజాతం కూడా కాంచన ఇంటికి వస్తారు.

అన్నయ్య వదిన రాలేదా? అని కాంచన అడగ్గానే మీ అన్నయ్యకేనా నీ మీద ప్రేమ ఉంది, మేం కూడా వచ్చామని సుమిత్ర ఎంట్రీ ఇస్తుంది. అది చూసి కాంచన ఫుల్ హ్యాపీ అవుతుంది. మేం వచ్చింది దీప, కార్తీక్ ల పెళ్లి గురించి మాట్లాడటానికి అని శివన్నారాయణ అంటాడు. ముహూర్తాలు, మిగతా విషయాల గురించి ఈ రోజు మా...