భారతదేశం, జనవరి 2 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో సుమిత్ర రిపోర్ట్స్ గురించి కార్తీక్, దీప మాట్లాడుకుంటారు. ఇంతలో దశరథ్ వచ్చి హాస్పిటల్‌కు వెళ్దామని చెబుతాడు. సరేనని దీపను టెన్షన్ పడకని చెప్పి కార్తీక్ వెళ్తాడు. ఇంతలో తులసి కోటలో ఉన్న దీపం ఆరిపోతుంది. అది చూసి దీప షాక్ అవుతుంది.

హాస్పిటల్‌లో డాక్టర్ హారికను దశరథ్, కార్తీక్ కలుస్తారు. దశరథ్ కంగారు చూసి వాటర్ తాగమంటుంది డాక్టర్. దశరథ్ నీళ్లు తాగుతాడు. కార్తీక్ ఎవరు అని డాక్టర్ అడిగితే మేనల్లుడు, కొడుకు కంటే ఎక్కువ అని చాలా కంగారుగా చెబుతాడు దశరథ్. పక్కనున్న డాక్టర్‌కు దశరథ్ గారికి బీపీ చెక్ చేయించండి, హై బీపీ ఉన్నట్లుంది అని పంపిస్తుంది డాక్టర్ హారిక.

కార్తీక్‌ను మాత్రం ఉండమంటుంది. సుమిత్రకు ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెబుతుంది. మరోవైపు కాశీ గురించి ఏం ఆలోచించావ్ అని జ్యోత్స్నను ...