భారతదేశం, జూలై 15 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 15వ తేదీ ఎపిసోడ్ లో దీపను సుమిత్రకు కుంకుమ పెట్టమని కాంచన చెప్తుంది. వద్దంటే ఈ తాంబూలం తీసుకెళ్లు వదిన అని సుమిత్రతో చెప్తుంది కాంచన. కాంచన ఫోర్స్ చేయడంతో సుమిత్రకు బొట్టు పెడుతుంది వంటలక్క. దీప చేత్తో బొట్టు పెడితే కుంకుమ కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది వదిన అని సుమిత్ర అంటే.. కాదు సౌభాగ్య లక్ష్మీ సంతోషిస్తుంది వదిన అని కాంచన అంటుంది. తనను మన ఇంటి యజమానురాలిలాగే ఉండమని దీపకు చెప్పు అని కార్తీక్ తో అంటుంది కాంచన.

కాశీకి జ్యోత్స్న నుంచి కాల్ రావడం చూసి స్వప్న షాక్ అవుతుంది. మా ఆయనకెందుకు ఫోన్ చేశావు? మ్యాటర్ ఏంటో నాకు తెలియాలి అని స్వప్న అంటుంది. కాశీ వచ్చి ఫోన్ లాక్కుని వెళ్లిపోతాడు. అసలేం జరుగుతుంది అని స్వప్నకు డౌట్ వస్తుంది.

బెడ్ రూమ్ లో కార్తీక్, దీప మాట్లాడుకుంటారు. ఇంటికి రాలేరా ...