భారతదేశం, డిసెంబర్ 20 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కార్తీక్‌కు సుమిత్ర నోటి నుంచి రక్తం పడిన విషయం గురించి చెబుతుంది దీప. అమ్మకు ఏదైనా వ్యాధి ఉందా అని భయపడుతుంది. దాంతో గురూజీ చెప్పిన గండం అత్తకేనా అని కార్తీక్ అనుమానిస్తాడు. కడుపుతో ఉన్నప్పుడు ఎక్కువ భయాలు, టెన్షన్ పడకూడదని కార్తీక్ నచ్చ జెప్పే ప్రయత్నం చేస్తాడు కార్తీక్.

ఒక తల్లిని తెలియకుండానే పోగొట్టుకున్నాను. మరో తల్లిని పోగోట్టుకోలేను. మా అమ్మ అనారోగ్యంతో పోయింది. కానీ మా అత్త మాత్రం నావల్ల చనిపోయిందనేది. ఇప్పుడు నీకు అర్థం అవుతుందా నా భయం అని దీప అంటుంది. అర్థమవుతోంది. ఒకసారి మావయ్యతో మాట్లాడుదాం అని కార్తీక్ అంటాడు. దశరథ్‌తో మాట్లాడుతారు.

దీప ప్రెగ్నెంట్ కాకముందునుంచే మీ అత్తకు ఆరోగ్యం బాలేదురా. కానీ పట్టించుకోలేదని దశరథ్ అంటాడు. ఇంతలో సుమిత్ర వస్తుంది. హాస్పిటల్‌...