భారతదేశం, జనవరి 23 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో దేవుడికి మొక్కుకుని తాళి కళ్లకు అద్దుకుంటుంది కాంచన. అప్పుడే శ్రీధర్ వస్తాడు. నువ్వు తాళి కళ్లకు అద్దుకుంటున్న మాత్రానా నన్ను ఇష్టపడుతున్నావని అనుకోను. ఆడదానికి ఐదో తనం అలంకరణ కాదు. జీవితంలో ఒక భాగం అని అంటాడు శ్రీధర్.

నవ్వే కాలం అయిపోయింది. ఇప్పుడు కన్నీటి కాలం నడుస్తోంది అని శ్రీధర్ అంటే.. చమురు ఉన్నంత కాలమే దీపం ఉంటుంది. రెండు కదలవు కానీ వెలిగి ఇస్తుంది అని కాంచన అంటుంటే దీపం ఆరిపోతుంది. శ్రీధర్ మళ్లీ దీపం వెలిగిస్తాడు. నేను వచ్చింది వెలుగు నింపడానికే. మీ నాన్న ఇంటికి వెళ్దాం పదా. మీ అన్నయ్య నన్ను తీసుకురమ్మన్నాడు. నువ్వు రాకుంటే బాధపడే వారు చాలా మంది ఉన్నారు అని శ్రీధర్ అంటాడు.

మరోవైపు కిచెన్‌లో దీపతో కార్తీక్‌కు తాటిబెళ్లం పరమాన్నం అంటే చాలా ఇష్టం అని సుమిత్ర చెబుతుంది....