భారతదేశం, నవంబర్ 11 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కొత్త సీఈఓ గురించి బోర్డ్ మీటింగ్ జరుగుతుంది. కొత్త సీఈఓగా దీపను ప్రపోజ్ చేస్తున్నట్లు కార్తీక్ చెబుతాడు. ఈ నిర్ణయం తనకు నచ్చలేదని దీప వెళ్లిపోతుంది. కార్తీక్ వెళ్లి దీపతో మాట్లాడుతాడు. ఇంటికోసం నువ్వు కూడా బలంగా నిలబడాలని చెప్పానుగా. ఇదంతా మనదేగా. మనమే కాపాడుకోవాలని దీపను వెనక్కి తీసుకొస్తాడు కార్తీక్.

సుమిత్రను అడ్డుపడమని పారిజాతం అంటే.. అక్కడ అంతా పెద్దవాళ్లు ఉన్నారు. చూసుకుంటారు అని సుమిత్ర అంటుంది. దీప నిలబడటానికి అర్హత, యోగ్యత ఉండాలని, ఆ రెండు లేని వాళ్లను ఎలా నిలబెడతారు. ఐదో తరగతి చదువుకున్న ఈ పల్లెటూరు మొద్దు సీఈఓ అయితే ఇంకెంత డ్యామేజ్ జరుగుతుందో అని జ్యోత్స్న అంటుంది.

పల్లెటూరు మొద్దు పదాన్ని కార్తీక్ ఖండిస్తే జ్యోత్స్న వెనక్కి తీసుకుంటుంది. దీప ఏం చేయగలదు. ల్యాప్‌...