భారతదేశం, ఆగస్టు 6 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ లో ఇచ్చిన జాతకం ప్రకారం ఇప్పటికే పెళ్లి అయిపోయి ఉండాలని గురువు చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడు చేయి చూసి జాతకం చెప్పమని అడుగుతారు. మీరు ఇచ్చిన జాతకం, చేయి చూస్తే ఎక్కడ పొంతన కుదరడం లేదు. చేయి మారిందని అనడంతో జ్యోత్స్న, పారిజాతం కంగారు పడతారు. తను నా మనవరాలు. ఏ శుభ కార్యం చేయలన్నా జరగడం లేదని శివన్నారాయణ అంటాడు.

జాతకం ఈ అమ్మాయిదేనా? లేదా మీకు మరో మనవరాలు ఉందా? అని గురువు మళ్లీ అడుగుతాడు. ఆ జాతకం మా కూతురిదేనని సుమిత్ర స్పష్టంగా చెప్తుంది. మీరు ఇచ్చిన జాతకంలో ఇప్పుడు ఆ కల్యాణ గీత లేదమ్మా అని గురువు అంటాడు. అప్పుడే జ్యూస్ తాగండని దీప అడుగుతుంది. ఓ సారి నీ చేయి చూపించమని అడుగుతాడు గురువు. మహర్జాతకం, రాణి యోగం. ముందున్నవన్నీ మంచి రోజులేనమ్మా. పెంచిన నాన్నకు దూరమైనా కన్నతండ్రికి ద...