భారతదేశం, డిసెంబర్ 15 -- కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 15 ఎపిసోడ్ లో కాంచనతో ఫోన్లో మాట్లాడుతూ నా సగం నీతో పంచుకోవాల్సిందే అంటూ టిఫిన్ క్యారేజీ పంపిస్తాడు శ్రీధర్. నువ్వు రావని తెలిసే, టిఫిన్లు పంపించా. మనం అనుకోవాలే కానీ మనసులో ఉన్న మనిషి మనతో ఉన్నట్లే. నువ్వు అక్కడ తిను. నేను ఇక్కడ తింటానని కాల్ కట్ చేస్తాడు శ్రీధర్. కాంచన ప్లేట్లో పెట్టుకుని తింటూ ఫీల్ అవుతుంది.

మీ బాధ మీరు చెప్పుకుంటున్నారు నా బాధ నేను చెప్పుకోలేకపోతున్నా. కొన్నిటిని వద్దని వదిలేసుకున్నాక మనతో ఉంటే మనసుకు చేసే గాయాలవుతాయి. మనకు రాసి ఉంటే అది మనకు దక్కుతుందంటారు. నా అయిదోతనం మీద భగవంతుడు మరొకరి పేరు రాశాడనుకుంటూ ఏడుస్తూ కాంచన టిఫిన్ చేస్తుంది.

మీరు వస్తే ఇంత సంతోషంగా ఉంటుందనుకుంటే వారానికి మూడు రోజులు ఇక్కడే టిఫిన్ చేసేలా కండీషన్ పెట్టేవాడిని అని కార్తీక్, దీపతో శ్రీధ...