Hyderabad, జూన్ 21 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో స్నానం చేసి వచ్చిన శ్రీధర్ తన లుంగీ గురించి అడుగుతాడు. అల్లుడి గారికి ఇచ్చానని కావేరి చెబుతుంది. ఒరేయ్ సిగ్గు లేనోడా నా లుంగీ ఇవ్వరా అంటూ శ్రీధర్ అరుస్తూ వెళ్తాడు. కాశీ దగ్గరికి వెళ్లి నన్ను అడక్కుండా నా లుంగీ ఎందుకు కట్టుకున్నావురా అని అంటాడు.

లుంగీ కోసం గొడవ ఏంటండి. ఎవరైనా వెంటే చెండాలంగా ఉంటుంది అని కావేరి అంటుంది. దాంతో లుంగీ విప్పడానికి నీలు ట్రై చేస్తుంది. భార్యను ఆపిన కాశీ మావయ్య రెండు నిమిషాలు ఆగండి ఇస్తాను అని అంటాడు. నువ్ కట్టుకుంది నేను కట్టుకోనా అని శ్రీధర్ అంటాడు. మరి ఎంత అయిందో చెప్పండి డబ్బులు ఇస్తాను అంటాడు కాశీ.

రెండు వేలు అని శ్రీధర్ చెబుతాడు. సాధారణంగా అయితే నా కొత్త లుంగీ దొంగతనం చేసినందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. కానీ దయతలిచి డబ్బులు తీసుకుని వెళ్తున్న...