భారతదేశం, జనవరి 5 -- కార్తీక దీపం 2 టుడే జనవరి 5 ఎపిసోడ్ లో సుమిత్రకు బ్లడ్ క్యాన్సర్ అనే విషయాన్ని తలుచుకుంటూ కార్తీక్ బాధపడతాడు. నీ బాధ నాకు అర్థమవుతూనే ఉంది బావ. హాస్పిటల్ కు వెళ్లి వచ్చినప్పటి నుంచి ఇలాగే ఉన్నావు. హాస్పిటల్లో ఏం జరిగిందో చెప్పు. రిపోర్ట్ గురించి అడిగితే తడబడుతున్నావు. మా అమ్మ వైపు ఎందుకు చూడలేకపోయావు. ఏమైంది? బావ అని అడుగుతుంది దీప.

మా నాన్న కూడా ఏమీ తెలియనట్టు ఉన్నాడు. చెప్పు బావ నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. అమ్మకు ఏమైనా అయిందా? అని దీప అడుగుతుంది. అయింది, కానీ మీ అమ్మకు కాదు, నీకు. ఎవరికి ఏమైనా అయితే నీకు చెప్పకుండా ఉంటానా? నువ్వు జాగ్రత్తగా ఉండాలని కార్తీక్ అంటాడు. అప్పుడే శ్రీధర్ కాల్ చేసి ఆఫీస్ లో అకౌంట్ ఫైల్స్, జ్యోత్స్న తప్పు చేసిందని నిరూపించే ప్రూఫ్స్ మిస్ అయ్యాయని చెప్తాడు.

ఆఫీస్ లో నా క్యాబిన్ లోనే ప...