భారతదేశం, అక్టోబర్ 28 -- కార్తీక దీపం 2 టుడే అక్టోబర్ 28 ఎపిసోడ్ లో గ్రానీ, మనకు లైఫ్ లో రెండే దారులుంటాయి. ఒకటి గెలవడం, మరొకటి ఓడిపోవడం. ఓడిపోవాలంటే నీలా చూస్తూ ఉంటే సరిపోతుందని జ్యోత్స్న అంటుంది. మరి నువ్వేం చేశావ్? ఆస్తి మీద కార్తీక్ మీద తప్ప నీకు ఎవరి మీద ప్రేమ లేదు. నువ్వు ఎప్పుడైతే ఫామ్ లోకి వచ్చావో అప్పుడే అటు ఇటు కాకుండా అయిపోయానని పారు అంటుంది. మమ్మీ ఎక్కడుందో బావకు తెలుసని నా డౌట్ అని జ్యో అంటుంది.

మమ్మీ గురించి చెప్పకుండా ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమోనని జ్యోత్స్న అనుమానపడుతుంది. నువ్వు అనుకున్నది సాధించాలంటే సుమిత్ర, దశరథ కలిసి ఉండాలి. కార్తీక్, దీప వాళ్లిద్దరు కలుపుతారని పారు అంటుంది. బావ సీఈఓ అవుతాడు, దీప ఇంటి దేవత అవుతుంది. ఆ క్రెడిట్ ఎవరికి దక్కకూడదు. నా మీద ఉన్న చెడ్డ పేరు పోవాలంటే మమ్మీని నేనే తీసుకురావాలని జ్యో అంటుంది....