భారతదేశం, సెప్టెంబర్ 9 -- కార్తీక దీపం 2 టుడే సెప్టెంబర్ 9వ తేదీ ఎపిసోడ్ లో శ్రీధర్ కాల్ చేస్తే కార్తీక్ మాట్లాడతాడు. వ్రతానికి రమ్మన్నా వచ్చా. ఆ తర్వాత ఫోన్ చేశావా? అంటే అవసరం తీరిపోయింది కదా అనుకుంటున్నావా? ఏం చేశానో చెప్పు అని అడుగుతాడు శ్రీధర్. నీ అభిప్రాయాలు మార్చుకోమని అనను. ప్రవర్తన మన చేతిలోనే ఉంది. తప్పు చేసిన తర్వాత నీ బిహేవియర్ పూర్తిగా మారిపోయింది మాస్టారూ. పిల్లను ఇచ్చి తండ్రి కొట్టడం తప్పు కాదు. కానీ ఆ తర్వాత ఎప్పుడైనా మంచిగా మాట్లాడావా? అని కార్తీక్ అంటాడు.

పారు చేసే పనులు తాతకు నచ్చవు. వాళ్ల పక్కన ఉన్నవాళ్లు కూడా నచ్చరు. నలుగురు గౌరవంగా చూసేలా ఉండాలి. తాత దాసు మామయ్యను దగ్గరకు తీసుకుంటే మీకేంటీ మంట? వెళ్లి తాతతో గొడవపడుతున్నారని శ్రీధర్ తో కార్తీక్ అంటాడు. అల్లుని కంటే పని మనిషిని పెళ్లి చేసుకున్న దాసు అల్లుడి కంటే ఎక్కువ...