భారతదేశం, నవంబర్ 28 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో రూ. 2 కోట్ల 34 లక్షల గురించి జ్యోత్స్నను అంతా నిలదీస్తారు. సుమిత్ర, దశరథ్ మ్యారేజ్ యానివర్సరీకి ల్యాండ్ కొని గిఫ్ట్‌గా ఇద్దామనుకున్నాను. కానీ అని కుదరలేదని జ్యోత్స్న చెబుతుంది. అదంతా పచ్చి అబద్ధం అని నీ పక్కనున్న పారిజాతం అనుకున్నా నేను నమ్ముతాను అని కార్తీక్ అంటాడు.

ఎవరిని అడిగి ల్యాండ్ కొన్నావ్ అని శివ నారాయణ అడుగుతాడు. అన్ని ఆస్తులు మీ పేరు మీదనే ఉన్నాయి. నా తల్లి మీద మాత్రం ఒక్క ఆస్తి లేదు. ఆడవాళ్ల మీద ఆస్తులు ఉండకూడదా అని జ్యోత్స్న అంటుంది. దాంతో జ్యోత్స్నను పారిజాతం తెగ పొగిడేస్తుంది. తల్లి హృదయం గెలుచుకున్న కూతురు అవార్డ్ ఇవ్వాలి అని పారు అంటుంది.

దాంతో కార్తీక్ వెటకారంగా మాట్లాడుతాడు. ఫంక్షన్ హాల్ బుక్ చేసి నాలుగు వందల మంది చూస్తుండగా అవార్డ్ ఇద్దామని సెటైర్లు వేస్త...