భారతదేశం, సెప్టెంబర్ 17 -- కార్తీక దీపం 2 టుడే సెప్టెంబర్ 17వ తేదీ ఎపిసోడ్ లో నాకు నా కొడుకే హీరో అని కార్తీక్ తో శ్రీధర్ అంటాడు. నా కోరిక తీరిపోయింది మాస్టారు. నా తండ్రిని ఎలా చూడాలో అలా కనిపించావు. నచ్చావు మాస్టారు అని కార్తీక్ అంటాడు. ఈ రోజు నా కూతురి బర్త్ డే ఫ్యామిలీతో వచ్చేయండని శ్రీధర్ ను పిలుస్తాడు కార్తీక్. నువ్వు మాత్రం పోలీసు కేసు గురించి ఎవరినీ అడగొద్దని శ్రీధర్ అంటే, అవన్నీ చూసుకోవడానికి మా నాన్న ఉన్నాడని కార్తీక్ అంటాడు.

శౌర్య బర్త్ డే సెలబ్రేషన్స్ కు అంతా రెడీ చేస్తారు. కేక్ కటింగ్ అయిపోయాక అందరం కలిసి మూవీకి వెళ్దామని శౌర్య అడిగితే కార్తీక్ సరేనంటాడు. జ్యోత్స్న ఫోన్ చేసి అయిదు నిమిషాల్లో రావాలని కార్తీక్ కు ఆర్డర్ వేస్తుంది. చాలా ఆర్జెంట్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. నువ్వు వెళ్లొద్దు నాన్న అని శౌర్య అంటుంది. చెప్పిన కూ...