భారతదేశం, అక్టోబర్ 27 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే అక్టోబర్ 27వ తేదీ ఎపిసోడ్ లో ఈ రోజు నువ్వు కొత్త తాతను చూడబోతున్నావని కార్తీక్ తో అంటాడు శివన్నారాయణ. ఫోన్లో సుమిత్ర ఫొటో చూస్తూ బాధపడతాడు దశరథ. ఫొటో చూస్తే కాదు వెతకాలి అని పారు అంటుంది. మమ్మీని నేను వెతికి తీసుకొస్తానని జ్యో అనగానే, అవసరం లేదని శివన్నారాయణ ఎంట్రీ ఇస్తాడు. ఎవరూ వెతకాల్సిన అవసరం లేదంటాడు.

పేపర్లో సుమిత్ర కోసం ప్రకటన వేయిస్తానని దశరథ అంటాడు. అవసరం లేదు, ఆమె తప్పిపోలేదు వెళ్లిపోయింది. సుమిత్ర వెళ్లిపోయిందని ఎందుకు బాధపడుతున్నావు? సుమిత్ర వెళ్లకుండా ఉంటే మాట్లాడేవాడివా? తిట్టకుండా ఉండేవాడివా? తిడితే వెళ్లిపోవాలా? నీ మీద గౌరవం లేని నీ భార్య గురించి నువ్వు ఎందుకురా ఆలోచిస్తావు? అని శివన్నారాయణ సీరియస్ గా మాట్లాడతాడు. వద్దనుకొని వెళ్లిపోయిన భార్య గురించి దశరథ ఎందుకు బాధపడాలి...