Hyderabad, అక్టోబర్ 4 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో ఈ వేలం పాట తర్వాత నీ మనవరాలి జాతకమే మారబోతుంది అని జ్యోత్స్న అంటుంది. ఆ కార్తీక్ ఒక్కడిని కంట్రోల్ చేయగలితే చాలు అని పారు అంటే.. అందుకే బావను వేలంపాటకు రాకుండా చేశాను అని జ్యో అంటుంది.

శివ నారాయణ వచ్చి వేలంపాటకు వెళ్దామంటాడు. ఇంతలో కార్తీక్, దీప వస్తారు. సుమిత్ర దగ్గర ఆశీర్వాదం తీసుకుంటానంటుంది జ్యోత్స్న. ఒకరు గెలుస్తానంటే ఓడించేందుకు చాలా మంది ట్రై చేస్తుంటారు. నీలాంటి తల్లి ఉంటే అన్ని సాధిస్తా అని కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటుంది. కార్తీక్ బయలుదేరుదాం పదా అని శివ నారాయణ అంటాడు.

డ్రైవర్ అవసరం లేదు. నేను కారు డ్రైవ్ చేస్తానంటుంది జ్యో. నువ్వు డ్రైవ్ చేయి అయినా కార్తీక్ వస్తాడు. వాడు మన మనిషిగా వస్తాడు. కొన్నిసార్లు మనకంటే చిన్న వాళ్ల సలహాలు కూడా మెడిసిన్‌లా పనిచేస్తాయ...