భారతదేశం, మే 15 -- దీప‌కు ద‌గ్గ‌రుండి సేవ‌లు చేస్తాడు కార్తీక్‌. తొంద‌ర‌గానే కోలుకుంటావ‌ని డాక్ట‌ర్ అన్నాడ‌ని దీప‌తో చెబుతాడు కార్తీక్‌. మీరు ఇంత జాగ్ర‌త్త‌గా చూసుకుంటే తొంద‌ర‌గా కోలుకోకుండా ఎలా ఉంటాన‌ని దీప ఎమోష‌న‌ల్ అవుతుంది.సుమిత్ర కూతురు దీప అంటూ దాసు చెప్పిన మాట‌లు ప‌దే ప‌దే కార్తీక్‌కు గుర్తొస్తుంటాయి. మీ అమ్మ‌ను నువ్వు చూశావా అని దీప‌ను అడుగుతాడు కార్తీక్‌.

నేను పుట్ట‌గానే మా అమ్మ చ‌నిపోయింద‌ట‌..పేరు అంబుజ‌వ‌ల్లి అని దీప బ‌దులిస్తుంది. అమ్మ ఫొటో ఉండేది. కానీ అత్త‌య్య ఎక్క‌డో ప‌డేసింద‌ని దీప చెబుతుంది. దీప మాట‌ల‌ను చాటు నుంచి అన‌సూయ వింటుంది. అప్పుడు నాకు త‌ల‌తిక్క ఉండేద‌ని మ‌న‌సులో అనుకుంటుంది.

నీ పుట్టుక గురించి మీ నాన్న నీకు ఏం చేప్ప‌లేదా అని దీప‌ను అడుగుతాడు కార్తీక్‌. నువ్వు కుబేర్ సొంత కూతురివేనా ప్ర‌శ్నిస్తాడు. కార్తీక్ ప్ర...