భారతదేశం, జనవరి 12 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 12 ఎపిసోడ్ లో జీవితంలో నిజాలను మోయడం చాలా కష్టం మామయ్య. అలా మోసి గుండె రాటుదేలిపోయింది. సుమిత్ర అత్త అంటే ఎవరు? కన్నతల్లి లాంటిది. అత్తకు కొడుకు లేడనే లోటు మేనల్లుడితో తీర్చుకుంది. ఇప్పుడు అత్తను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తుంటే లోపల ఎంత బాధగా ఉంటుందో ఆలోచించమని కార్తీక్ ఎమోషనల్ అవుతాడు.

అత్తకు మనమే ధైర్యం. అత్తకు ఏం కాదని ముందు మనం నమ్మాలని కార్తీక్ అంటాడు. అవును అన్నయ్య, నిండు నూరేళ్లు వదిన, నువ్వు కలిసే ఉంటారు. కూతురి పెళ్లి మీ చేతుల మీదుగా జరుగుతుంది. మనవల్లను చూస్తారు. వదినకు ఏం కాదన్నయ్యా అని దశరథకు చెప్తూ ఏడ్చేస్తుంది కాంచన.

దాసుతో పారిజాతం మాట్లాడుతుంది. సుమిత్ర గురించి తెలిసి కూడా ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉన్నావు? విధిరాతను నువ్వు తప్పించొచ్చు. ఈ కథను మలుపు తిప్పగల సూత్రధారివి....